జాతీయ వార్తలు

సేవా పన్ను 16-18 శాతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: విమాన ప్రయా ణం, రెస్టారెంట్లకు వెళ్లడం, చివరికి ఫోన్ బిల్లు కూడా భారం కాబోతోందా? బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో భారీగానే సర్వీసు పన్ను విధించే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 16 నుంచి 18శాతం వరకూ సేవా పన్ను పెరుగవచ్చునని తెలుస్తోంది. ప్రతిపాదిత జిఎస్‌టి శ్లాబ్‌లకు దగ్గరగా తీసుకెళ్లే ఉద్దేశంతోనే సేవా పన్నును ఆర్థిక మంత్రి పెంచబోతున్నట్టు స్పష్టం అవుతోంది. జూలై 1 నుంచి జిఎస్‌టి అమలులోకి వచ్చిన మరుక్షణమే సేవా పన్ను, ఎక్సైజ్, వ్యాట్‌లు తొలగిపోతాయి. జిఎస్‌టి పన్నుల శ్లాబ్‌లను 5, 12,18,28శాతంగా నిర్ణయించారు. సర్వీసు పన్నును కూడా వాటికి దగ్గరగా తీసుకెళ్లడమన్నది అర్థవంతమైన చర్యేనని నిపుణులు చెబుతున్నారు. గత బడ్జెట్‌లో సేవా పన్నును 15శాతం వరకూ పెంచిన జైట్లీ ఇప్పుడు 16శాతం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే వౌలిక సర్వీసులు, ఎక్కువ విలువ కలిగిన సర్వీసులుగా సేవలను విభజించి దానికనుగుణంగానే పన్నులు వేవే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అంటే వౌలిక సేవలన్నింటినీ 12శాతం సేవా పన్ను పరిధిలోకి తీసుకురావచ్చునని, హెచ్చు విలువ కలిగిన వాటిని 18శాతం సేవా పన్ను పరిధిలోకి తేవచ్చునన్న సంకేతాలూ వినిపిస్తున్నాయి.