జాతీయ వార్తలు

‘కృష్ణా’ వివాదంపై రేపు ట్రిబ్యునల్‌లో వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి మంగళవారం కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ విచారించనుంది. కృష్ణా బేసిన్‌లో నీటి కేటాయింపుతో పాటు, తక్కువ నీటి లభ్యత ఉన్న సంవత్సరం నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ విచారిస్తుంది. కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించిన అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ ట్రిబ్యునల్ గతంలోనే నిర్ణయం వెలువరించింది. కాగా ఎగువున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజాగా నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కోరుతున్నాయి. కాగా కర్నాటక, మహారాష్ట్ర మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 89వ సెక్షన్ తమకు వర్తించదని, కృష్ణా జలాల కేటాయింపు రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.