జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: గోవా ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్థానిక పోలింగ్ అధికారులను ఆదేశించింది. ఓటర్లను లంచం తీసుకోమంటూ ప్రోత్సహించిన వ్యాఖ్యలకు సంబంధించిన ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, అలాంటి వ్యక్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ గతంలో జారీ చేసిన నోటీసుకు వివరణ సైతం ఇవ్వలేదని, అందువల్ల వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఈ నెల 31 సాయంత్రం 3.00 గంటలలోగా ఆ రిపోర్టును అందించాలని స్థానిక అధికారులను ఆదేశించింది.