జాతీయ వార్తలు

భారీగా నగదు, మద్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ నియమించిన నిఘా, వ్యయ పర్యవేక్షణ బృందాలు రూ.96.09 కోట్ల నగదును, రూ.25.22 కోట్ల విలువగల 14.27 లక్షల లీటర్ల మద్యాన్ని, రూ.19.83 కోట్ల విలువగల 4,700 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో అధిక భాగాన్ని ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో స్వాధీనం చేసుకున్నాయి. ఈ నెల మొదట్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నాటినుంచి శనివారం వరకు సేకరించిన గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా రూ.87.67 కోట్లు, పంజాబ్‌లో రూ.6.60 కోట్లు, గోవాలో రూ.1.27 కోట్లు, ఉత్తరాఖండ్‌లో రూ.47.06 లక్షలు, మణిపూర్‌లో రూ.8.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ అయిదు రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లుగా అనుమానిస్తున్న మద్యం తదితరాలను ఇసి నియమించిన పోలీసు, ఎక్సైజ్ సిబ్బందితో కూడిన బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో రూ.20.62 కోట్ల విలువగల 8.01 లక్షల లీటర్లు, పంజాబ్‌లో రూ.2.69 కోట్ల విలువ గల అయిదు లక్షలకు పైగా లీటర్లు, ఉత్తరాఖండ్‌లో రూ. 93.91 లక్షల విలువ గల 36వేలకు పైగా లీటర్లు, గోవాలో రూ.81.80 లక్షల విలువ గల 71వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని భటిండా జిల్లాలో శనివారం ఒక్కరోజే ఈ బృందాలు ఒక లక్ష మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటి విలువను అంచనా వేస్తున్నాయి. మాదకద్రవ్యాలు ఎక్కువగా పంజాబ్‌లో పట్టుబడ్డాయి. ఈ రాష్ట్రంలో రూ.12.30 కోట్ల విలువగల 2,632 కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో రూ.4.89 కోట్ల విలువగల 2,035 కిలోల మాదకద్రవ్యాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లో రూ.2కోట్లకు పైగా విలువగల మాదకద్రవ్యాలను, గోవాలో రూ.34.22 లక్షల విలువగల 6.85 కిలోల మాదకద్రవ్యాలను, ఉత్తరాఖండ్‌లో రూ.28.54 లక్షల విలువగల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ మాదకద్రవ్యాలలో హెరాయిన్, పోపి హస్క్, చరస్, గంజా, స్మాక్ వంటివి ఉన్నాయి.