జాతీయ వార్తలు

మళ్లీ మాకే పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్కాపుర (్ఫరీద్‌కోట్), జనవరి 29: ప్రధాని నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, అది పంజాబ్‌ను పణంగా పెట్టి తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవాలని కలలు కంటున్న బయటి పార్టీ అని, ఎక్కడినుంచి వచ్చిందో అక్కడికే దాన్ని పంపించి వేయాలని పంజాబ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాల్వా ప్రాంతంలోని కోట్కాపురలో ఆదివారం జరిగిన బిజెపి ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ శిరోమణి అకాలీదళ్-బిజెపి కూటమి కాకుండా మరే పార్టీ అయినా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంజాబ్‌కేకాక మొత్తం దేశానికే ప్రమాదమని, అందువల్ల ఈ కూటమికే మరోసారి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. ‘ఈ ఎన్నికల్లో పంజాబ్‌ను నాశనం చేసి తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అలాంటి కలలు కనే వారిని వాళ్లు ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే (్ఢల్లీకి) తిప్పి పంపించాలి’ అని పంజాబ్ ఎన్నికల రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీనుద్దేశించి మోదీ అన్నారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన ఢిల్లీలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమని ఆ పార్టీని నిలదీయండని ప్రధాని అన్నారు.
పంజాబ్ భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని, ఒకవేళ బయటినుంచి వచ్చినవారు లేదా విలాస జీవితం గడిపేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్రంతోపాటుగా దేశంకూడా ఆ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తూ మోదీ అన్నారు. పంజాబ్ రాజకీయాల్లో భీష్ముడులాంటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌ను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్నారని ఆయన కోడలు, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ప్రధాని దృష్టికి తీసుకు రాగా, ఇది నిజంగా బాధాకరమని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కానీ, బాదల్ కానీ, తమ రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడు కూడా అలాంటి పదాలు ఉపయోగించలేదని అన్నారు.

చిత్రం..కోట్కాపురలో ఆదివారం జరిగిన బిజెపి ఎన్నికల ర్యాలీలో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్