జాతీయ వార్తలు

మాది గంగా యమున సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 29: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తమ కలయిక గంగా-యమున సంగమం లాంటిదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీ నేత, యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు మొట్టమొదటిసారి సంయుక్తంగా ఆదివారం విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సామరస్యం, శాంతి స్థాపనే తమ ధ్యేయమని రాహుల్ గాంధీ అన్నారు. ‘సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌ల భాగస్వామ్యం విభజన, అసహన రాజకీయాలకు గుణపాఠం. బిజెపి విభజన రాజకీయాలకు బుద్ధి చెప్పేందుకే ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. నాకు, అఖిలేశ్ మధ్య రాజకీయ సంబంధమే కాదు, వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది’ అని రాహుల్ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండుపార్టీలు కలిసే పోటీ చేస్తాయా అన్న ప్రశ్నకు ప్రస్తుతం అది చర్చనీయాంశం కాదని దాటేశారు. ‘మేమిద్దరం సైకిల్‌కు రెండు చక్రాల్లాంటి వాళ్లం. మా మధ్య వయోభేదం కూడా పెద్దగా లేదు. మేమిద్దరం కలిసి ఉత్తరప్రదేశ్‌ను సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నాం. మా బంధం గంగా-యమున సంగమం లాంటిది. మా కలయికలోంచి అభివృద్ధి అనే సరస్వతి నది బయటకు ఉబికి వస్తుంది’ అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ మధ్య పొత్తు యావత్ దేశాన్ని క్యూలలో నిలబెట్టిన వారికి గట్టి జవాబిస్తుందన్నారు. తాము రాష్ట్రంలో 300కు పైగా సీట్లను గెలుస్తామని పేర్కొన్నారు. ఈ కూటమిలో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం ఉందా అన్న ప్రశ్నకు అఖిలేశ్ జవాబిస్తూ ‘ఆమెకు చోటెలా ఇవ్వాలి? ఎంత చోటు ఆక్రమిస్తుందో తెలుసా? ఎందుకంటే ఆమె గుర్తు ఏనుగు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
యుపి ముఖ్యమంత్రి గురించి రాహుల్ మాట్లాడుతూ నేను గతంలో కూడా అఖిలేశ్ పనితీరును మెచ్చుకున్నా. అతణ్ని మరింత మంచిగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి. మా మధ్య కొన్ని అనుకూలతలు, విభేదాలు కూడా ఉన్నాయి. కొన్ని అంశాలలో రాజీపడి, ఇద్దరం అంగీకరించే అంశాల ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అని అన్నారు. తమ ఎన్నికల ప్రచార వ్యూహం ఏమిటో ఇప్పుడే చెప్పమని ఇద్దరు నేతలు అన్నారు. తమ పార్టీల మధ్య పొత్తు అవకాశవాదం కానేకాదని, బిజెపి, ఆరెస్సెస్‌లు యూపిని చీల్చకుండా చూసేందుకే తాము కలిశామన్నారు.

చిత్రం...లక్నోలో విలేఖరుల సమావేశంలో అఖిలేశ్, రాహుల్