జాతీయ వార్తలు

హెచ్-1బి వీసాలపై ట్రంప్ కొరడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేకెత్తిస్తున్న నేపథ్యంలో అమెరికాలో పనిచేసే భారతీయులపై కూడా దీని ప్రభావం అనివార్యంగా కనిపిస్తోంది. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారికి అమెరికాలో ప్రవేశం లేదని ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్ హెచ్1బి వీసాలనూ కఠినతరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగాలు, జీతాలు, చివరికి వారి సంక్షేమంపైనే ప్రభావం పడుతుందని చెబుతున్నారు. హెచ్1బి వీసాలపై ఎక్కువగా భారతీయులే అమెరికా వెళుతున్నారు దీనిపై ఏ మాత్రం ప్రతికూల నిర్ణయం వెలువడినా దాని ప్రభావం వల్ల వేలాది మంది భారతీయులు అనేక విధాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ జీవితాలు, జీతాలు, మనుగడకు ఎలాంటి బెంగ ఉండదని ఇప్పటి వరకూ భావించిన భారతీయులందరిలోనూ ట్రంప్ తాజా యోచన కలవరం పుట్టిస్తోంది. చట్ట పరంగా హెచ్1బి వీసాలు పొందిన వారిలో సైతం రాబోయే మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైట్‌హౌస్ పరిశీలనలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ముసాయిదా వివరాలను ఓ న్యూస్ చానల్ బయట పెట్టింది. ఇది అమలులోకి వస్తే ఆమెరికాకు చట్టపరమైన వలసలూ గణనీయంగా తగ్గిపోతాయి. అమెరికా కార్మికుల ప్రయోజనాలు, వారి ఉద్యోగాలు, జీతాలు, సంక్షేమానికే పెద్ద పీట వేసే అనేక నిబంధనలు ఈ ముసాయిదాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శిక్షణా వీసాల పొడగింపు లేకుండా చేయడం, హెచ్1బి వీసాలు పొందిన భర్త లేదా భార్యకు వర్క్ పర్మిట్‌ను తొలగించడం వంటి ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఎల్-1 వీసాలు కలిగిన గెస్ట్ వర్కర్లకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీలనూ హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేయాలన్న నిబంధన కూడా ఈ ఉత్తర్వు ముసాయిదాలో ఉంది. ఇంకా ఎన్నో కఠిన నిబంధనలు కలిగిన ఈ ముసాయిదా ట్రంప్ సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌గా వస్తే మాత్రం భారత్‌కు చెందిన వేలాది మంది నిపుణలైన ఉద్యోగులు, విద్యార్థులకు కష్టకాలం మొదలైనట్టేనని చెబుతున్నారు.