తెలంగాణ

దేశానికి గత వైభవం రావాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, మార్చి 21: దేశం హిందూ రాజ్యంగా ఉంటే భారతమాతకి జై అనని వాడు జైల్లో ఉండేవాడని విహెచ్‌పి అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా అన్నారు. ఆదివారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జరిగిన విహెచ్‌పి గ్రామ కమిటీ కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఉండి భారత్‌మాతకి జై అనని వాడు కన్న తల్లికి ద్రోహం చేసినవాడే అవుతాడన్నారు. మూడువేల సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం హిందూ రాజ్యంగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని క్రైస్తవ, ముస్లిం దేశాలు హిందూ దేశం నుండి వచ్చినవే అని ఆయన అన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించడం, హిందూ రాష్ట్రాన్ని సాధించడం, హిందూ సమాజాన్ని నిర్మించడమే విహెచ్‌పి లక్ష్యమన్నారు. మతమార్పిడిల నుండి హిందూ జాతిని కాపాడడం, గోవులను రక్షించడం, పేదలకు ఉచితంగా ఆహారం, విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ రాజ్యం ఉంటే హజ్ యాత్రలకు సబ్సిడీలు ఉండేవి కావని, ఒక వ్యక్తికి నలుగురు భార్యలు ఉండేవారు కాదన్నారు. దేశానికి గత వైభవం రావాలంటే భారతీయ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. భాగ్యనగరం, కాశ్మీర్, కాబూల్, కాందహార్, పాకిస్తాన్ అన్ని తమ హిందూ పూర్వీకులవే నని ఆయన ఉద్ఘాటించారు. ముస్లిం, క్రైస్తవుల మాదిరిగా హిందువులు వారంలో ఒకసారి దేవాలయాలకు సంఘటితంగా వెళ్లి సామూహిక పూజలు నిర్వహించి హిందూ దేశం గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శత్రువుల నుండి కాపాడుకోవాడానికి హిందూ జాగరణ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, పెద్దిరెడ్డి క్రిష్ణారెడ్డి, ఆకరాపు కేశవరాజు, ధనుంజయ్, రమణయ్య, వెంకటేశం, పబ్బ సత్యనారాయణ, ఏర్రం ముత్యాలు, కైరంకొండ తిరుపతి, పడకంటి సంఘమేశ్వర్‌తో పాటు వందలాది మంది విహెచ్‌పి కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రవీణ్‌భాయి తొగాడియాను కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.