జాతీయ వార్తలు

ఆరో తరగతి విద్యార్థినికి గర్భం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఆరో తరగతి చదువుతున్న ఒక బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) చేయించుకోవాల్సిందిగా ఆ పాఠశాల అధికారులు ఆ చిన్నారిని వత్తిడి చేశారని వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వార్తలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అలాగే బాధిత బాలికకు తగిన సహాయాన్ని అందజేయడంతోపాటు ఆమె సంరక్షణకు చేపట్టిన చర్యల వివరాలను తెలియజేయాలని కూడా జార్ఖండ్ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సి వెల్లడించింది.