జాతీయ వార్తలు

నేటినుంచి బడ్జెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటంతో తొలి విడత సమావేశాలు మొదలవుతాయి. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు ఉద్యుక్తులవుతున్న నేపథ్యంలో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలాగే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో పెద్దగా గొడవలు జరుగకపోవచ్చు. తొలివిడత సమావేశాలు కేవలం 8 రోజులు మాత్రమే. అంటే ఫిబ్రవరి 9వరకే సాగుతాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బిఎస్పీ, అకాలీదళ్, వామపక్షాలు ఎన్నికల హడావుడిలో ఉన్నందున బడ్జెట్ సమావేశాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్టప్రతి ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమవుతాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు. జనవరి 1న అరుణ్‌జైట్లీ రైల్వే పద్దులతో కూడిన 2017-18 సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభకు ప్రతిపాదిస్తారు. ఈవారం 4రోజులు, వచ్చే వారం 4 రోజులు మాత్రమే పార్లమెంటు మొదడి విడత సమావేశాలు కొనసాగుతాయి. రాష్టప్రతి ప్రసంగం, దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ ప్రతిపాదన, దానిపై చర్చ జరపటంతోనే ఎనిమిది రోజులు గడిచిపోతాయని అంటున్నారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పటం, బడ్జెట్‌పై సాధారణ చర్చ జరపటంతోపాటు ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పాత పెద్ద నోట్ల రద్దుపై ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరుగుతున్నందున బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం తెలిసిందే. అయితే ఎన్డీయే ప్రభుత్వం ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్టా బడ్జెట్‌లో వీటికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు, ప్రకటనలు ఉండకుండా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంది.