జాతీయ వార్తలు

డ్రగ్స్ మహమ్మారిని తరిమేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫగ్వారా, జనవరి 30: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మాదకద్రవ్యాల మహమ్మారిని నిర్మూలిస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారందరినీ జైళ్లలో పెడతామని ఆ పార్టీ అధినేత్రి మాయావతి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్‌లో ఆ పార్టీ సోమవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాయావతి మొదటిసారిగా మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలందరికీ జీవనోపాధి కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. పంజాబ్‌ను నిరుద్యోగం, మాదకద్రవ్యాల సమస్యలు ఇంకా పీడిస్తున్నాయని, ఈ సమస్యలకు అధికార ఎస్‌ఎడి-బిజెపి కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు సమాన బాధ్యులని ఆరోపించారు. ఈ రెండు సమస్యలపై తమ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మాదకద్రవ్యాలకు బానిసైన వారందరినీ ఆ మహమ్మారి బారినుంచి బయటికి తీసుకువస్తామన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని, దోషులను జైళ్లలో పెడతామని భరోసా ఇచ్చారు. ప్రజల జీవనోపాధికోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఓట్లకోసం మిగతా అన్ని పార్టీలు పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నాయని పేర్కొంటూ, వాటికి ఆశపడి ఆ పార్టీలను నమ్మొద్దని ప్రజలను హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలు తమ హామీలను అమలు చేయవని పేర్కొన్నారు. పంజాబ్‌ను పీడిస్తున్న సర్వ రోగాలను నిర్మూలించడానికి బిఎస్‌పికి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పంజాబ్‌లో పాదుకోవడానికి బిఎస్‌పి తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతుల ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్న దోబా, మఝా ప్రాంతాలలో గెలుపుకోసం ఆ పార్టీ శ్రమిస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు గట్టిగా కట్టుబడిన విశ్వసనీయమైన వ్యక్తులనే బిఎస్‌పి అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు.

చిత్రం..ఫగ్వారాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో మాయావతి