జాతీయ వార్తలు

33వేల కోట్లు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన హెచ్ -1 బి వీసాల కల్లోలం భారత ఐటి కంపెనీలను కుదిపేసింది. ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సహా ఐదు అగ్రగామి భారత ఐటి కంపెనీలు దాదాపు 33వేల కోట్ల రూపాయల మేర నష్ట పోయాయి. అంటే వీటి విలువ దాదాపు నాలుగు శాతం మేర పడిపోయింది. హెచ్1బి వీసాలపై తీసుకునే ఉద్యోగుల కనీస వేతనాన్ని లక్షా 30వేల డాలర్లకు పెంచడం వల్ల అమెరికన్లతు భారత్ సహా ఇతర దేశీయులను నియోగించే అవకాశాలు ఈ కంపెనీలకు దారుణంగా తగ్గిపోతాయి. అంటే వీటిపై ఉద్యోగాల్లో చేరే వారికి ఇవ్వాల్సిన జీతాలు దాదాపు 60 నుంచి 70శాతం వరకూ పెరిగిపోతాయి. దీని ప్రభావం మంగళవారం జరిగిన స్టాక్ మార్కెట్ లావాదేవీలపై తీవ్రంగానే కనిపించింది. ఈ పరిస్థితిని ఐటి కంపెనీలు ఎలా ఎదుర్కోగలుగుతాయన్న ఆందోళన ఇనె్వస్టర్లలో ద్యోతకమైంది.