జాతీయ వార్తలు

భవిత బంగారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధిపై దాదాపు అరశాతం దాకా ప్రభావం చూపించనున్నదని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు తిరిగి మామూలు స్థాయిలో అంటే 6.75-7.5 శాతం మధ్య ఉంటుందని కూడా ఆ సర్వే పేర్కొంది. కాగా, ప్రభుత్వం పన్నులను భారీగా తగ్గించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా సర్వే అభిప్రాయ పడింది. వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లనేకాకుండా కార్పొరేట్ పన్నులను కూడా తగ్గించాలని, దానికి ఒక టైమ్‌టేబుల్‌ను కూడా రూపొందించాలని పేర్కొంది. అయితే అదే సమయంలో అన్నిరకాల అధిక ఆదాయాలను పన్ను పరిధిలోకి తెచ్చే విధంగా పన్ను పరిధిని మరింత విస్తరించాలని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది. అధిక ఆదాయాలంటే ఏమిటో సర్వే స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఇప్పటివరకు పన్ను లేని వ్యవసాయ ఆదాయాల గురించేననేది సుస్పష్టం. బడ్జెట్‌కు ముందు సమర్పించే ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు.కాగా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపించినప్పటికీ దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలే ఉంటాయని సర్వే పేర్కొంది. నగదు సరఫరా తగ్గిపోవడం, దరిమిలా దాని ప్రభావంతో జిడిపి వృద్ధి రేటు మందగించడం లాంటివి తాత్కాలిక ప్రభావాలు కాగా, డిజిటల్ లావాదేవీలు పెరగడం, ఫలితంగా పన్ను వసూళ్లు పెరగడం, రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడం లాంటివి దీర్ఘకాలిక ప్రయోజనాలని, వీటి ఫలితంగా దీర్ఘకాలంలో పన్నుల రాబడి పెరగడంతో పాటు జిడిపి వృద్ధి సైతం వేగవంతమవుతుందని సర్వే స్పష్టం చేసింది.
ఆర్థిక సర్వేలోని ప్రధానాంశాలు:
* 2018 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 6-75-7.5శాతం ఉంటుంది.
* 2017 ఆర్థిక సంవత్సరం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది 5,2 శాతం ఉండవచ్చు. 2016 ఆర్థిక సంవత్సరంలోని 7.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువ.
* 2016 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి 1.2 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 4.1 శాతంగా ఉండొచ్చు.
* భారత దేశ స్థూల ఆర్థిక మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి.
* 2018 ఆర్థిక సంవత్సరంలోకూడా భారత్ శరవేగంగా అభివృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే ఉంటుంది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధిపై నోట్ల రద్దు, చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలులాంటి వాటి ప్రభావాన్ని అంచనా వేయడం జరిగింది.
* 2018 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పుంజుకునే అవకాశాలు లేవు.
* రాష్ట్రాల సగటు ద్రవ్య లోటు జిఎస్‌డిపిలో 3 శాతానికి పరిమితం చేయడం జరిగింది. రెవిన్యూ లోటును పూర్తిగా తొలగించడం జరిగింది.
* 2017 ఆర్థిక సంవత్సరంలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితమయ్యే అవకాశం.
* పేదరికం నిర్మూలనం కోసం ప్రతి పౌరుడికి కనీస ఆదాయం ఉండేలా చూసేందుకు యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (యుబిఐ) పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సమయం ఇంకా రానప్పటికీ దీనిపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరమయితే ఉంది.
* నోట్ల రద్దు, డిజిటలైజేషన్ కారణంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాపై ప్రభావం ఉండే అవకాశం.
* ఏప్రిల్ చివరినాటికల్లా నోట్ల రద్దు సమస్యలు పూర్తిగా తొలగిపోవచ్చు.
* నోట్ల రద్దువల్ల వ్యవస్థలో నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం డబ్బు వెలుగులోకి వస్తోంది.
* డిజిటలైజేషన్ కారణంగా కేద్ర ఖజానాకు మరిన్ని నిధులు.
* నోట్ల రద్దు ప్రభావం కనిపించే లోగానే నగదు విత్‌డ్రాలపై పరిమితులు ఎత్తేయాలి.
* జిఎస్‌టి, అవినీతి నిరోధక బిల్లు, నోట్ల రద్దు అనంతరం తీసుకున్న చర్యలు, ఇతర వ్యవస్థాగత సంస్కరణల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి 8-10 శాతం జిడిపి వృద్ధికి చేరుకోగలుగుతుంది.

చిత్రం..ఆర్థిక సర్వే వివరాలను మీడియాకు వివరిస్తున్న ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్