జాతీయ వార్తలు

చారిత్రక క్షణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31:కొత్త సాధారణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది..పన్నుల్లో కలిసొచ్చేదెంత..రైలు ప్రయాణం ఖేదమా..మోదమా..ఇతరత్రా సామాన్యులకు ఒరిగేదెంత..? ఇదీ బడ్జెట్‌పై జనసామాన్యంలో రేకెత్తుతున్న ఉత్కంఠ! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఇటు సాధారణ బడ్జెట్..అటు రైల్వే బడ్జెట్‌లు ఒకేసారి రాబోతున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ చారిత్రక తరుణానికి అంకురార్పణ చేయబోతున్నారు. ఆర్థిక సర్వే ఆశావహ పరిస్థితుల్ని ఆవిష్కరించిన నేపథ్యంలో పోటాపోటీగా ముందుకొస్తున్న 2017-18 సంవత్సర జంట బడ్జెట్‌ల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో తెలిపే అంచనా ఇది. ఆదాయాన్ని పెంచుకుంటూనే ప్రజలకు లబ్ధిని చేకూర్చే పలు పథకాలను జైట్లీ ప్రకటించే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు, అన్ని పన్నుల్ని కలిపేసే జిఎస్‌టి..ఈ రెండూ చారిత్రకమైన ఆర్థిక నిర్ణయాలే..వీటి ప్రభావాన్ని తగ్గించే అంశంపైనే జైట్లీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రెండున్నర లక్షల నుంచి ఆదాయం పన్ను పరిమితిని మూడు లక్షలకు పెంచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీన్ని నాలుగు లక్షల వరకూ పెంచవచ్చునని కథనాలు వస్తున్నా..అందుకు అవకాశాలు చాలా తక్కువే. అలాగే వైద్య పరమైన లబ్ధిని కూడా చేకూర్చే సూచనలున్నాయి. గృహ రుణాలపై రెండున్నల లక్షల వరకూ పన్ను రాయితీని కల్పించేందుకూ అవకాశం ఉంది. సార్వత్రిక వౌలిక వేతనం అన్న కొత్త అంశాన్ని కూడా చేర్చే సూచనలున్నాయి. అంటే ప్రజల కనీస వసరాలు తీర్చే పరిమాణంలో కనీస వేతనం ఉండాలన్నది దీని లక్ష్యం.రైతులు, గ్రామీణ భారతం, మహిళలు, ఆరోగ్యం, విద్య తదితర రంగాలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే రీతిలో కొత్త పథకాలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించవచ్చు. అలాగే స్టార్టప్‌లకు, దేశీయ తయారీ రంగానికీ ఆర్థిక పరమైన ఊతం కలిగించే అవకాశం ఉంది. సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వేలను జైట్లీ ఏ మేరకు శక్తివంతంగా తీర్చిదిద్దుతారన్నదీ ఆసక్తిని కలిగిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెరదించుతూ సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశ పెట్టే రైల్వే బడ్జెట్‌పైనా ఎన్నో ఆశలున్నాయి. రైల్వేల భద్రత, వౌలిక సదుపాయాల అభివృద్ధి, రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు ప్రయాణికులకూ మరిన్ని తాయిలాలను జైట్లీ తన కొత్త బడ్జెట్‌లో అందించే సూచనలున్నాయి.

చిత్రం..2017-18 వార్షిక బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ