జాతీయ వార్తలు

జల్లికట్టు అనుమతిపై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టును అనుమతిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి చేసిన సవరణను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో జల్లికట్టుపై 2016 జనవరి 7న జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడానికి కేంద్రాన్ని కోర్టు అనుమతించింది. కొత్త చట్టాన్ని సవాలు చేయడానికి వీలుగా పెండింగ్‌లో ఉన్న తమ పిటిషన్లలో సవరణలు చేసుకోవడానికి ఈ పిటిషన్లు దాఖలు చేసిన జంతుప్రేమికుల సంఘాలు, వ్యక్తులను సైతం న్యాయస్థానం అనుమతించింది. అయితే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా జల్లికట్టుకు మద్దతుగా ఇటీవల చెన్నైలోని మెరీనా బీచ్‌లో, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల సందర్భంగా హింసకు దారితీసిన పరిస్థితులపైన, ఆందోళనకారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపైన విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాలు, ఇతర వర్గాల డిమాండ్‌కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కమిషన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దర్యాప్తు కమిషన్‌కు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, మూడు నెలల్లోగా దర్యాప్తును పూర్తిచేయాలని కమిషన్‌ను కోరినట్లు మంగళవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం తెలిపారు. అంతేకాకుండా జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెరీనా బీచ్‌లోను, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను వారం రోజులపాటు జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన 36 మంది విద్యార్థులపై పెట్టిన కేసులను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కొంతమంది పోలీసులు వాహనాలను తగులబెట్టడం లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసు సైబర్ నేరాల విభాగం దర్యాప్తు జరుపుతోందని, ఒకవేళ ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.