జాతీయ వార్తలు

హామీల అమలుపై ఎన్‌డిఏకు చిత్తశుద్ధిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై ఎలాంటి వ్యాఖ్య లేకపోవటం తమకు బాధ కలిగించిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు వాపోయారు. రామచందర్‌రావు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయటం గురించి ప్రణబ్ ముఖర్జీ తమ ప్రసంగంలో ప్రస్తావించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని ఎన్‌డిఏ ప్రభుత్వం రాష్టప్రతి ప్రసంగంలో చేరుస్తుందని ఏపీకి ప్రజలు, ఏపీ కాంగ్రెస్ కమిటీ ఎంతగానో ఆశపడ్డాయి కానీ వారికి నిరాశే మిగిలిందని రామచందర్‌రావు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎన్‌డిఏ ప్రభుత్వం రాష్టప్రతి ప్రసంగం ద్వారా ప్రకటిస్తుందని తాము భావించామని ఆయన తెలిపారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఏపీకి, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయటంలో ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది కేంద్రానికి ఎంత మాత్రం లేదనేది ఈరోజు మరోసారి రుజువైందని రామచందర్‌రావు చెప్పారు.