జాతీయ వార్తలు

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా నది జలాలను విభజిత, ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ జరపాడానికి ఏర్పాటు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరగకుండానే వాయిదా పడింది. మంగళవారం నాడు రెండు రాష్ట్రాల మధ్య నీటికేటాయింపులపై ట్రిబ్యునల్‌లో వాదనలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు తమతమ అభిప్రాయాలను ట్రిబ్యునల్‌కు లిఖితపూర్వకంగా సమర్పించకపోవడంతో మార్చి 23,24 తేదీల్లో విచారణ చేపట్టనున్నట్టు ట్రిబ్యునల్ తెలిపింది. అలాగే కృష్ణా జలాలు కేటాయించడానికి రెండు రాష్ట్రాలు తమతమ అభిప్రాయలను లిఖితపూర్వకంగా సమర్పించేందుకు మార్చి నెల 20వ తేదీ వరకు ట్రిబ్యునల్ తెలుగు రాష్ట్రాలకు గడువుఇచ్చింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధి కేవలం రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరపాలని గతంలోట్రిబ్యునల్ తీర్పులో స్పష్టం చేసింది. కృష్ణా జలాలను గతంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే జరపాల్సి ఉందని, మహారాష్ట్ర, కర్నాటక వాటాలకు ఆటంకం కలిగించరాదని అ తీర్పులో పేర్కొనడం తెలిసిందే.