జాతీయ వార్తలు

ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను తీసుకుంటారని తెలిసింది. పీపుల్స్ చాయిస్ అవార్డు, అస్కార్ పురస్కారాల పండుగ వేదికపై తళుక్కుమన్న ప్రియాంకను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అంతర్జాతీయంగా ఆమెకు ఉన్న ప్రాచుర్యాన్ని వినియోగించుకుంటూ విదేశీ టూరిస్టులను ఆకర్షించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు ఇన్‌క్రెటిబుల్ ఇండియా ప్రచారకర్తగా ఉన్న బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ పదవీకాలం ముగిసింది. వివిధ కారణాల వల్ల అమీర్‌ను కొనసాగించేది లేదని ప్రభుత్వ స్పష్టం చేసింది. అమీర్ స్థానంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే పనామా పేపర్లలో అమితాబ్ పేరు రావడంతో టూరిజం శాఖ పునరాలోచనలో పడిందని అంటున్నారు. అమితాబ్ కూడా తనను ఎవరూ ప్రచారకర్తగా ఉండాలని అడగలేదని చెప్పడం గమనార్హం.