జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ బరిలో 687మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జనవరి 31: ఉత్తరాఖండ్‌లో నామినేషన్ల స్క్రూటినీ తరువాత 687 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 స్థానాలకు ఈ నెల 15న పోలింగ్ జరగనుంది. మొత్తం 722 నామినేషన్లు దాఖలు చేయగా 35 స్క్రూటినీలో తిరస్కరించారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల నుంచి దాఖలైన నామినేషన్లన్నీ సక్రమంగానే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తిరస్కరించిన నామినేషన్లలో ఇండిపెండెంట్లు దాఖలు చేసిన ఇరవై ఉన్నాయని అన్నారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం డెహ్రడూన్ జిల్లా ధరంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై మంది బరిలో ఉన్నారు. అలాగే రాయ్‌పూర్‌లో 19 మంది, సహాస్‌పూర్‌లో 16 మంది, ఛౌబత్తాఖల్‌లో 16 మంది పోటీలో ఉన్నారని ఇసి స్పష్టం చేసింది. ఛక్రాట, పురోలా, జగేశ్వర్, ఛంపావట్ స్థానాలో నలుగురేసి చొప్పున పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఒక్కరే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. హరిద్వార్ (రూరల్), కిఛా నియోజకవర్గాల్లో ఆయన బరిలో ఉన్నారు. రెండుచోట్లా ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.