జాతీయ వార్తలు

ఉచితాలు అనుచితం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: తమను గెలిపిస్తే ఉచిత తాయిలాలు ఇస్తామని రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వకుండా నియంత్రించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌పై తమ వివరణలను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరింది. అంతేకాదు ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి జారీ చేసిన గైడ్‌లైన్స్ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో కూడా తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రాలతో కూడిన బెంచ్ ఎన్నికల కమిషన్‌ను కోరింది. ‘మీరు జారీ చేసిన గైడ్‌లైన్స్ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలియజేస్తూ మీ సమాధానాన్ని దాఖలు చేయాలని బెంచ్ ఇసిని ఆదేశించింది. కోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేస్తూ, ఎన్నికల కమిషన్, కేంద్రం రెండూ కూడా ఎనిమిది వారాల్లోగా తమ సమాధానాన్ని దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అనంతరం కోర్టు కేసు తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. త్వరలో జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాజకీయ పార్టీలు ఉచిత తాయిలాలు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ నిరోధించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన అశోక్ శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలకు సంబణదించి గైడ్‌లైన్స్‌ను రూపొందించాలని భారత ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేవించిందని, అయితే ఇసి జారీ చేసిన గైడ్‌లైన్స్ ఈ ఆదేశాలను నీరుగార్చే విధంగా ఉన్నాయని అడ్వకేట్ ఎ మైత్రి ద్వారా దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలోప్రకటించే ఉచిత తాయిలాల హామీలు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 సెక్షన్ కింద ‘అవినీతి చర్య’ కిందికి రానప్పటికీ ఏ రకమయిన ఉచిత తాయిలాలైనా సరే ప్రజలందరిపైనా ప్రభావం చూపిస్తాయనేది, అన్ని పార్టీలకు సమాన అవకాశముండడాన్ని అది దెబ్బతీస్తుందనేది సుస్పష్టమని సుప్రీంకోర్టు 2013 జూలైలో ఇచ్చిన ఓ తీర్పులో అభిప్రాయ పడింది.
రాజకీయ పార్టీలు చేసే అలాంటి హామీలు ప్రజలపై ప్రభావం చూపిస్తాయని, న్యాయమైన ఎన్నికల ప్రక్రియకు అది విఘాతమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు.