జాతీయ వార్తలు

రక్తపు మడుగులో బాలుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొప్పాళ, ఫిబ్రవరి 2: మనుషులలో రానురాను మానవత్వం మంటగలిసిపోతోందనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడిరోడ్డుపై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ కుర్రాడు సహాయం కేకలు వేస్తున్నప్పటికీ దారిన వెళ్తున్న వారు ఎవరూ పట్టింట్టంచుకోలేదు సరికదా తమ సెల్‌ఫోన్లలో ఆ దృ శ్యాన్ని ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. దీంతో ఆ కుర్రాడిని ఆలస్యంగా ఆస్పత్రికి తరలించే సరికల్లా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఏ ఒక్కరైనా సరే తన తమ్ముడ్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి, 20 నిమిషాలు ముందు ఆస్పత్రికి తరలించి ఉంటే అతను బతికి ఉండే వాడని ఆ కుర్రాడి సోదరుడు వాపోతున్నాడు. కర్నాటకలోని కొప్పాళలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 15 ఏళ్ల అన్వర్ అలీ బుధవారం ఉదయం ఎప్పటిలాగే తాను పని చేస్తున్న మార్కెట్‌కు సైకిల్‌పై వెళ్తుండగా హొస్పేటనుంచి హుబ్బళ్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టి అతనిపైనుంచి వెళ్లింది. రోడ్డు మధ్యలో రక్తం మడుగులో పడి ఉన్న అలీ సాయం కోసం కేకలు వేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. పైగా కొందరయితే ఫోన్లలో ఆ దృశ్యాన్ని ఫోటోలు తీసుకోవడం మొదలు పెట్టారు. ‘ఎవరైనా పట్టించుకుని ఉంటే నా తమ్ముడు బతికి ఉండేవాడు. 15-20 నిమిషాలు సంఘటన స్థలంలోనే వృథా అయ్యాయి’ అని అలీ సోదరుడు రియాజ్ గొల్లుమన్నాడు.
అయితే ప్రమాదం చూసిన జనం షాక్‌కు గురయ్యారని, బాలుడు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడంతో ఏ విధంగా సాయం చేయాలో వాళ్లకు తోచలేదని ఈ సంఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి అనడం కొసమెరుపు.

చిత్రం..ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయన అన్వర్ అలీ