జాతీయ వార్తలు

మారన్ సోదరులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఎయర్‌సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌కు ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ డీల్‌లో అవకతవకలకు పాల్పడ్డారని మారన్ సోదరులపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు గురువారం తీర్పునిచ్చారు. మారన్ సోదరులు, మిగతా నిందితులపై అభియోగాలు, బెయిల్ దరఖాస్తులకు సంబంధించి చార్జిషీట్ అందజేయాలని ప్రత్యేక న్యాయమూర్తి ఓపి సైనీ గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. కాగా తమపై సిబిఐ, ఇడిలు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని మారన్ సోదరులు పేర్కొన్నారు. కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ తన వాదన వినిపిస్తూ దయానిధి మారన్ తనకు అనుకూలమైన కంపెనీకి ప్రయోజనం చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణన్నింటినీ దయానిధి ఖండించారు. మారన్ సోదరులు, రాల్ఫ్ మార్షల్, టి ఆనంద కృష్ణన్, మెస్సర్స్ సన్ డైరెక్ట్ టివి(పి) లిమిటెడ్,మెస్సెర్స్ ఆస్ట్రో ఆల్ ఆసియా నెట్‌వర్క్స్ యుకె, మెసెర్స్ మాక్సి కమ్యూనికేషన్స్ బెర్హాద్, మలేసియా, మెసర్స్ సౌత్ ఆసియా ఎంటర్‌టైన్‌మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్(మలేసియా), అప్పటి టెలికాం శాఖ అదనపుకార్యదర్శి జెఎస్ శర్మలపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 1209-బి(నేరపూరిత కుట్ర)కింద కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దయానిధి మారన్, కళానిధి మారన్, కళానిధి భార్య కావేరి, సౌత్ ఆసియా ఎఫ్‌ఎం లిమిటెడ్ డైరెక్టర్ కె షణ్ముగం, సన్ డైరెక్ట్ టివి లిమిటెడ్‌లపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. ఇడి చార్జిషీట్ తరువాత ఆరుగురు నిందితులకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ వాటాల అమ్మకానికి సంబంధించి చెన్నైకు చెందిన టెలికాం ప్రమోటర్ సి శివశంకరన్ వివిధ కంపెనీలతో డీల్ సంభాషణలు జరిపారని సిబిఐ ఆరోపించింది. దర్యాప్తు సంస్థల ఆరోపణలన్నింటినీ దయానిధి తోసిపుచ్చారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలన్నీ 2005 అక్టోబర్‌లో ఖరారైనట్టు ఆయన తరఫున్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే సిబిఐ చార్జిషీట్‌లో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కళానిధి మారన్ వాదించారు. కృష్ణన్, మార్షల్‌ను అరెస్టు చేయాలని 2016 సెప్టెంబర్ 24న కోర్టు వారెంట్ జారీ చేసింది.