జాతీయ వార్తలు

గృహ నిర్మాణ రంగానికి మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్‌లో స్థిరాస్తి రంగానికి వౌళిక వసతుల ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గృహ నిర్మాణ రంగానికి మరింత ఊపు రానుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో తన కార్యాలయంలో వెంకయ్య విలేకరులతో మాట్లాడుతూ 2020 నాటికి అందరికీ అందుబాటులో ఇళ్లు నిర్మించాలనే ప్రధాని నరేంద్రమోదీ ఆశయాన్ని చేరుకునే దిశగా బడ్జెట్ రూపకల్పన చేశారని తెలిపారు. ఈ బడ్జెట్ వల్ల గృహ నిర్మాణాలకు రుణాలు చౌకగా లభించనున్నాయని వెల్లడించారు. నోట్ల రద్దు వల్ల బ్యాంకుల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నందున, అలాగే ఆదాయపు పన్ను రాయితీల వల్ల కూడా గృహ నిర్మాణ రంగానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రాలకు మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్లయితే ఆయా రాష్ట్రాలకు అదనంగా ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గనున్నాయని, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఈ బడ్జెట్‌ను తయారు చేశారని తెలిపారు. అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు వల్ల రైతులకు ఉపయోగకరం అన్నారు. రాజధాని రైతులకే కాకుండా తెలుగు వారికి ఇది శుభవార్త అనీ, ఏపీ రాజధాని నిర్మాణంలో మంచి పరిణామమని పేర్కొన్నారు.