జాతీయ వార్తలు

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నేరగాళ్లు తీహార్ జైలుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ ఇద్దరు ఖైదీలను తీహార్ జైలుకు తరలించారు. మరొక ఖైదీని ఎన్‌ఐఏ అధికారులు ముంబైకి పంపారు. పలు పేలుడు కేసుల్లో విచారణ కోసం ఎయిరిండియాకు చెందిన విమానంలో వీరిని ఆయా జైళ్లకు తరలించారు. అక్కడి కోర్టుల్లో విచారణ ముగిసిన తరువాత తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో 22 మంది మృతి చెందగా, 138 మంది గాయపడ్డారు. పేలుళ్ల కేసులో దోషులైన ఆరుగురిలో కీలకవ్యక్తి రియాజ్ భత్కల్ అనే నిందితుడు పాకిస్తాన్ పారిపోయాడు. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నేరగాళ్లు అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, జియావుర్ రహ్మాన్, ఎజాజ్ షేక్‌లకు 2016 డిసెంబర్ 19న రంగారెడ్డి జిల్లా ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. వీరిపై మహరాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నందున విచారణ కోసం వీరిని తిహార్, ముంబై జైళ్లకు తరలించినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

చిత్రం..యాసిన్ భత్కల్