జాతీయ వార్తలు

ఆ థ్రిల్లే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణమంటే చెప్పలేని ఆనందం. అలాంటిది రైలు సముద్ర గర్భంలోంచి వెళ్తుదంటే ఆ థ్రిల్లే వేరు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ కోసం ఏర్పాటు చేస్తున్న హైస్పీడ్ కారిడార్‌లో 21 కిలోమీటర్ల మేర సముద్రం కింద నుంచి టనె్నల్‌కు ప్లాన్ చేశారు. ఈ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న ప్రాజెక్టు కోసం సీనియర్ రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కారిడార్ కోసం ఎలివేటెట్ ట్రాక్ ఉంటుంది. థానే వద్ద సొరంగం ద్వారా ట్రైన్ వెళ్తుంది. 97,636 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు జపాన్ రుణ సదుపాయం కల్పిస్తోంది. ట్రాక్‌కు సంబంధించి సిగ్నలింగ్, పవర్ సిస్టమ్ పరికరాలన్నీ జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఒప్పందాలు అన్నీ ముగిసాక నిర్మాణ పనులు 2018 చివరికి ప్రారంభమవుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముంబయి- అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ గంటకు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుస్తుంది. అంటే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు. ప్రస్తుతం ముంబయి- అహ్మదాబాద్ మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం ఏడుగంటలు.