జాతీయ వార్తలు

నేడు తొలి సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్/ పంజాబ్, ఫిబ్రవరి 3: మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. శనివారం ఈ తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. పంజాబ్, గోవా రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ తొలి దశలోనే పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 1,145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 81 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహించడానికి రెండు వందల కంపెనీల పారామిలిటరీ బలగాలను రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి రెండు రోజుల ముందు ఒక కారు పేలిపోయి ఆరుగురు మృతి చెందడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా శనివారం ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 1,98,79,069 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 93,75,546 మంది మహిళలు, 415 మంది ట్రాన్స్‌జెండర్లు (లింగమార్పిడి చేసుకున్నవారు) ఉన్నారు. 22,615 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. అయితే దశాబ్ద కాలంగా అధికారంలో ఉండటం వల్ల ఎస్‌ఎడి-బిజెపి కూటమి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, కాంగ్రెస్, కొత్తగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.
గోవాలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 250 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 131 మంది
దక్షిణ గోవానుంచి, 119 మంది ఉత్తర గోవానుంచి బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. గోవాలో బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంజిపి కూటమి మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తిరుగుబాటు నాయకుడు సుభాశ్ వెలింగ్కర్ ఏర్పాటు చేసిన గోవా సురక్షా మంచ్ (జిఎస్‌ఎం), శివసేన పార్టీలు ఎంజిపి కూటమిలో ఉన్నాయి. మొదటిసారి బరిలోకి దిగిన ఆప్ 39 స్థానాల్లో, కాంగ్రెస్ 38 స్థానాల్లో, బిజెపి 37 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2012 ఎన్నికల్లో రాజకీయ పొత్తు కుదుర్చుకొని అధికారంలోకి వచ్చిన బిజెపి ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే తాను పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులను బలపరుస్తోంది.

చిత్రం..ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటియాలాలో విధులకు సిద్ధమైన సిఆర్‌పిఎఫ్ దళాలు