జాతీయ వార్తలు

నిర్భయ కేసులో దోషులకు మరణ శిక్షలపై పునర్విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: నిర్భయ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షలు విధించడానికి సంబంధించిన అంశాన్ని తిరిగి విచారిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో దోషులకు శిక్షలు విధించే విషయంలో ట్రయల్ కోర్టు నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి)లోని నిబంధనలను తు.చ తప్పకుండా పాటించలేదన్న కోర్టుకు సహకరించిన (అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనతో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది.
ఒక వేళ దోషిగా నిర్ధారణ అయిన పక్షంలో శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసే ముందు శిక్షకు సంబంధించి నిందితుడి వాదనను వ్యక్తిగతంగా వినాలని సిఆర్‌పిసిలోని 235 సెక్షన్ పేర్కొంటోందని రాజు రామచంద్రన్ వాదించారు. కాగా, ఈ తప్పును సరిదిద్దడానికి రెండు పద్ధతులున్నాయని, శిక్షలకు సంబంధించి తాజా ఆదేశాలు జారీ చేయడం కోసం కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించడం లేదా సుప్రీంకోర్టే తాజాగా ఈ అంశాన్ని విచారించడం ఈ మార్గాలని న్యాయమూర్తులు ఆర్ బానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయ పడింది. రెండో మార్గమే తగినదని తాము భావించినట్లు బెంచ్ అభిప్రాయ పడింది. అనంతరం ఈ నెల 23 లోగా తాజాగా అఫిడవిట్లను దాఖలు చేయాలని నిందితుల తరఫున్యాయవాదులు ఎంఎల్ శర్మ, ఎపి సింగ్‌లను కోరింది.