జాతీయ వార్తలు

అన్ని వర్శిటీల్లో అంబుడ్స్‌మన్ నియామకానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించడానికి నాలుగు నెలల్లోగా అన్ని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అంబుడ్స్‌మన్‌ను నియమించేలా చూడాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)ను ఆదేశించింది. యుజిసి నిబంధనలకు అనుగుణంగా అంబుడ్స్‌మన్‌ను నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రాలతో కూడిన బెంచ్ ఢిల్లీ యూనివర్శిటీని ఆదేశించింది. యుజిసి నియమ నిబంధనలు 2012కు అనుగుణంగా వీలయినంత త్వరగా అంబుడ్స్‌మన్‌ను నియమించడానికి ఢిల్లీ యూనివర్శిటీ తక్షణం చర్యలు తీసుకోవాలని బెంచ్ ఆదేశాల్లో పేర్కొంది. యూనివర్శిటీలు ముఖ్యంగా ఢిల్లీ వర్శిటీ యుజిసి నిబంధనలను పాటించడం లేదని పేర్కొంటూ ఢిల్లీ వర్శిటీ మాజీ లా విద్యార్థి ఒకరు దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.