జాతీయ వార్తలు

కమిటీ పరిశీలనలో విశాఖ రైల్వేజోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు రైల్వేమంత్రిత్వశాఖ వేసిన కమిటీ పరిశీలనలో ఉందని రైల్వే శాఖ సహాయమంత్రి రాజేన్ గొహేన్ మరోసారి తెలిపారు. ఏపికి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి, టిడిపి ఎంపీ టిజి వెంకటేశ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రాజేన్ గొహేన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపిలో రైల్వేజోన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి సీనియర్ రైల్వే అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. రైల్వేజోన్‌పై తుది నిర్ణయం తీసుకునేముందు ఆ కమిటీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రప్రభుత్వం, వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరపనుందని తెలిపారు. ఏపిలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం సహా అందరూ కేంద్రానికి విజ్ఞాపనలు చేశారని తెలిపారు. అలాగే కర్నూలులో రైల్వేకోచ్ వర్క్‌షాప్‌ను త్వరగా పూర్తి చేస్తామని ఎంపీ టిజి వెంకటేష్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ లిఖితపూర్వంగా తెలిపింది.
అలాగే ఏపి నూతన రాజధాని అమరావతికి అనుసంధాన మార్గం సర్వే పూర్తయ్యిందని, రాష్ట్రీయ వికాస్ నిగమ్ లిమిటెట్ సర్వే నివేదికను సమర్పించిందని రైల్వేశాఖ తెలిపింది. అమరావతికి మూడు కొత్తలైన్లను సర్వే నివేదికలో పేర్కొనిందని, మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ వేయాల్సి ఉందని, మొత్తం 2,679 కోట్ల వ్యయం కానుందని అంచనా వేసినట్టు పేర్కొంది.