జాతీయ వార్తలు

రాజధాని కేసు 14కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అమరావతి హరిత రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి)కి తెలిపింది. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై ఎన్జీటీలో దాఖలైన పిటిషన్లు తదుపరి విచారణ ఈనెల 14కి వాయిదా వేసింది. అమరావతి రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్లను శుక్రవారం ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ నూతన రాజధానిని సింగపూర్ ఆదర్శంతో నిర్మిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో ఆ దేశాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని ఎన్జీటిలో పిటిషనర్ తరపు న్యాయవాది రిత్విక్ దత్తా వాదించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వాదించారు. దాదాపుగా పిటిషన్ల తరపున వాదనాలు ముగిసాయి. ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హరిత రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎన్జీటికి తెలిపారు.