జాతీయ వార్తలు

అందవికారం వల్లే వరకట్న దురాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: ఓ పక్క వరకట్నాన్ని దురాచారంగా భావిస్తూ దాన్ని రూపుమాపే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విడ్డూరమైన అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చింది. అసలు వరకట్నం డిమాండ్ పెరగడానికి కారణం యువతులు అందకారం, వైకల్యంతో ఉండడమేనని అందులో స్పష్టం చేసింది. అంతేకాదు దీనితో కూడిన పాఠ్యపుస్తకాన్ని ఆమోదించింది కూడా. 12వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకంలో భారత దేశంలో ప్రధాన సామాజిక సమస్యలు అన్న అంశం కింద దీన్ని ప్రస్తావించింది. ఇందులో అందవికారం అన్న ఉప శీర్షికలో వరకట్న డిమాండ్‌లు ఎందుకు పెరుగుతున్నాయో తెలిపింది. అందవికారంతోపాటు శారీరక వైకల్యం ఉంటే అలాంటి పిల్లలకు పెళ్లిళ్లు కావని,వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చే వ్యక్తులు భారీగానే కట్నం డిమాండ్ చేస్తారంటూ పేర్కొంది. ఇలాంటి ఆడపిల్లలకు ఎలా పెళ్లిళ్లు చేయాలతో తెలియని నిస్సహాయతతో ఉండే వారి కుటుంబీకులు పెళ్లికొడుకు తరఫువారు అడిగే కట్నాన్ని ఇవ్వక తప్పడం లేదని...ఈరకమైన పరిస్థితులే వరకట్న దురాచారాన్ని పెంచి పోషిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన విద్యామంత్రి వినోద్ థాడే అధ్యయనాల బోర్డును సంప్రదించానని అన్నారు. అయితే తాము అధికారంలో లేనప్పుడు అంటే నాలుగేళ్ల క్రితం ఈ పాఠాన్ని 12వ తరగతి పాఠ్యాంశంలో చేర్చారని తెలిపారు. అయినా కూడా దీన్ని సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.