జాతీయ వార్తలు

జీవన సహచరి గొంతు నులిమి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఫిబ్రవరి 3: సామాజిక మాధ్యమం ద్వారా ఓ యువతితో స్నేహం చేసి, తరువాత జీవన సహచరిగా స్వీకరించి.. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపిన దుర్మార్గుడి ఉదంతమిది. నేరం బయటకు పొక్కకూడదనే ఉద్దేశంతో తన ఇంట్లోనే ఆ యువతి భౌతికకాయాన్ని పాలరాతి గద్దె కింద పాతిపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జీవన సహచరి ఆకాంక్ష అలియాస్ శే్వత శర్మ (28)ను హతమార్చిన ఈ కేసులో నిందితుడు ఉదయన్ దాస్ (32)ను పశ్చిమ బెంగాల్ పోలీసులు గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అరెస్టు చేశారు. నిరుడు డిసెంబర్‌లో పాతిపెట్టిన ఆకాంక్ష మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. పాలరాతి గద్దెను పగులగొట్టి దానిని బయటకు తీయడానికి పోలీసులకు ఆరు గంటలు పట్టింది. నిందితుడు మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కి, అందులో సిమెంటు పోశాడు. ఆ పెట్టెను మరో పెద్ద పెట్టెలో పెట్టి అందులోనూ సిమెంటు పోశాడు. తరువాత భోపాల్‌లో గల తన ఇంటిలోని మొదటి అంతస్థులో ఒకచోట ఆ పెద్ద పెట్టెను పెట్టి దానిపై పాలరాతితో గద్దె నిర్మించాడు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన ఆకాంక్ష తాను అమెరికాలో నివసిస్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పింది. అయితే నిరుడు డిసెంబర్ నుంచి ఆమె నుంచి టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే వస్తుండటం, ఆమె ఫోన్‌లో మాట్లాడకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన బెంగాల్ పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆకాంక్షను నిరుడు డిసెంబర్ చివరి వారంలో హతమార్చినట్లు నిందితుడు పోలీసుల ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. ఇద్దరి మధ్య తలెత్తిన ఒక వివాదంలో తనకు బాగా కోపం వచ్చి ఆమె గొంతు నులిమానని అతను వెల్లడించాడు.