జాతీయ వార్తలు

అది ఆర్థిక బిల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు అవుతుందా? కాదా అనేది ఎవరు? ఎలా నిర్దారిస్తారనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని రాజ్యసభలో మరోసారి చర్చకు తెచ్చేందుకు కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో ఆయన ఈ అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. జైరామ్ చాలా తెలివిగా కెవిపి రామచందర్‌రావు పేరు ప్రస్తావించకుండా తాను ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌పై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీనికి రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ సమయస్పూర్తితో బదులిచ్చారు. దీంతో కెవిపి ప్రైవేట్ మెంబర్ బిల్లు రూలింగ్‌పై చర్చ జరిపేందుకు జైరామ్ రమేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. రామచందర్‌రావుప్రతిపాదించిన బిల్లు ఆర్థిక బిల్లు అవుతుంది కాబట్టి దీనిపై రాజ్యసభలో చర్చ జరపటం సాధ్యం కాదని చైర్మన్ హమీద్ అన్సారీ రూలింగ్ ఇవ్వటం విదితమే. ప్రైవేటు బిల్లు ఆర్థిక బిల్లు కాదంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఇచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి ఎలా తీసుకుంటారు? ఏ నియమం కింద దీనిపై న్యాయ శాఖ అభిప్రాయం తెలుసుకుంటారు? అంటూ జైరామ్ ప్రశ్నించారు. దీనిపై ఉపాధ్యక్షుడు కురియన్ మాట్లాడుతూ ‘మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఎవరి పేరు ఎత్తకుండా లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ పూర్వపరాలు నాకు అర్థమయ్యాయి’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘మీ వెనక కెవిపి రామచందర్‌రావు ఉన్నారు’అని కురియన్ వ్యాఖ్యానించగానే జైరామ్ రమేష్ లేచి ఇలా మాట్లాడటం తగదని అభ్యంతరం చెప్పారు. కురియన్ సమాధానం ఇస్తూ ‘రామచందర్‌రావు మీ వెనక ఉన్నారని చెప్పానే తప్ప వెనక నుండి చేయిస్తున్నారని నేను అనలేదు’ అని వివరణ ఇచ్చారు. కురియన్ ఆ తరువాత జైరామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు తన రూలింగ్ ఇస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు అవుతుందంటూ ఇచ్చిన రూలింగ్‌కు దారి తీసిన రాజ్యసభ నియమాల గురించి తెలుసుకోవాలంటే రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీని కలుసుకోవాలని సూచించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ అభిప్రాయాల గురించి, న్యాయ శాఖ అభిప్రాయం తెలుసుకోవటంపై రాజ్యసభ సచివాలయంలో జరిగిన ప్రక్రియకు సంబంధించిన అంశాల గురించి సభకు వివరించటం సాధ్యం కాదన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకే రాజ్యసభ అధ్యక్షుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు అవుతుందనే నిర్ణయం తీసుకుని రూలింగ్ ఇచ్చారని కురియన్ స్పష్టం చేశారు. ఈ దశలో కెవిపి జోక్యం చేసుకుని తెరవెనక జరిగిన దానికి సంబంధించిన వివరాలు సభ్యులకు తెలియవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ దశలో జైరామ్ రమేష్ జోక్యం చేసుకుని ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు అవుతుందని స్పీకర్ చెప్పింది పట్టించుకోకుండా ఇది ఆర్థిక బిల్లు కాదంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు కదా? అని ప్రశ్నించారు. ఏ నియమం ఆధారంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు పరిధిలోకి వస్తుందనే రూలింగ్ గురించి తెలుసుకోవాలంటే హమీద్ అన్సారీని కలుసుకోవాలని కురియన్ స్పష్టం చేయటంతో ఈ వివాదానికి తెర పడింది. హమీద్ అన్సారీని కలుసుకునే అవకాశం తనకు కూడా ఇవ్వాలంటూ కెవిపి చేసిన విజ్ఞప్తిపై కురియన్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.