జాతీయ వార్తలు

ఎస్‌పి, కాంగ్రెస్ పొత్తు అనైతికం..అవకాశవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 3: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు అనైతికం, అవకాశవాదమని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభం ఓ ఫ్యామిలీ డ్రామాగా ఆయన అభివర్ణించారు.‘మెలోడీ, కామెడీతో కూడిన ట్రాజడీ’అని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.‘ఎస్‌పి, కాంగ్రెస్ పార్టీల పొత్తు అనైతికం. అవకాశవాదానికి పరాకాష్ట’అని శుక్రవారం ఇక్కడ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన కన్నతండ్రి ములాయంకు ‘సైకిల్’పై చోటు ఇవ్వడానికి నిరాకరించి ‘హ్యాండిల్’ కాంగ్రెస్ చేతికి అప్పగించారని వెంకయ్య అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఇటీవల తలెత్తిన సంక్షోభం ఓ ఫ్యామిలీ డ్రామా అని మంత్రి విరుచుకుపడ్డారు. యూపీ ఎన్నికల్లో బిజెపికి ఓటేసి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ‘నరేంద్ర మోదీ నాయకత్వంలో మేం పనిచేస్తున్నాం. సంస్కరణ, నైపుణ్యత, పారదర్శకతతో యూపీ రూపురేఖలు మారుస్తాం. మీరందరూ బిజెపికి మద్దతు ఇవ్వాలి’అని మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన మద్దతునే కొనసాగించాలని ఆయన కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, అప్నాదళ్ కలిసి పోటీచేసి 73 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ప్రధాని ఆవాస్ పథకం కింద ప్రతిపాదనలు పంపాలని కోరినా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పట్టించుకోలేదని పట్టణాభివృద్ధి మంత్రి ఆరోపించారు. తన మంత్రిత్వశాఖ అనేక సార్లు అడిగినా బేఖాతరు చేశారని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో సర్వే నిర్వహించి 30 లక్షల ఇళ్లు అవసరమని గుర్తించామన్న వెంకయ్య ‘అఖిలేశ్ ప్రభుత్వం మాత్రం 17 లక్షల ఇళ్లు సరిపోతాయని నివేదించింది’అని వెల్లడించారు.