జాతీయ వార్తలు

అభియోగాలకు బదులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతివాదులు కేంద్రం, ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిషా, పోలవరం ప్రాజెక్టు అథార్టీలకు శుక్రవారం నాడు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరైన పర్యవేక్షణ లేదని, గిరిజన హక్కుల చట్టం ఉల్లంఘిస్తున్నారని, పర్యావరణ అనుమతులలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో రేలా అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
పిటిషనర్ తరపు న్యాయవాదులు నిరూప్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ నాలుగు రాష్ట్రాల పరిధిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నందున బాధితులకు చెల్లిస్తున్న పరిహారంపై జాతీయ స్థాయిలో పర్యవేక్షణ కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల లక్ష మందికి పైగా గిరిజనులు నష్టపోతున్నారని, ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనుల హక్కులు ఉల్లంఘిస్తున్నారని వాదించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు అదనపు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా, అది అమలు కావడం లేదని వాదించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర గిరిజన శాఖ పర్యావరణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణ జరపాలని వాదించారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తాము విచారణ జరపలేమని చెప్పిన విషయాన్ని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లతో కలిపి ఈ పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. అనంతరం ఈ పిటిషన్‌పై కేంద్రానికి, ఏపీ, తెలంగాణ, ఒడిషాలకు నోటీసులు జారీ చేసింది.