జాతీయ వార్తలు

శశికళ పుష్ప పిటిషన్‌పై ఎఐడిఎంకె వివరణ కోరిన ఇసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: తమిళనాడులో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్, ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్పల మధ్య వివాదంలో మరో కొత్త మలుపు తిరిగింది. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్ ఎంపిక చెల్లందంటూ శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం అన్నాడిఎంకె పార్టీని ఆదేశించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కావడానికి పావులు కదుపుతున్న శశికళా నటరాజన్‌కు ఇదో ఎదురుదెబ్బే. జయలలిత మృతిచెందిన తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్ ఎంపిక అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిందని శశికళ పుష్ప తన ఫిర్యాదులో ఆరోపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఫిర్యాదుపై స్పందించాలని ఇసి అన్నాడిఎంకెను కోరినట్లు చెప్పిన ఆ వర్గాలు ఇది నోటీసు కానందున వివరణ ఇవ్వడానికి ఎలాంటి గడువూ లేదని తెలిపాయి. జయలలిత మృతిపై అనేక అనుమానాలున్నాయని వీటన్నిటిపైనా సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే శశికళా నటరాజన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అర్హురాలు కాదని అంటూ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ ఇసిని సైతం ఆశ్రయించారు.