జాతీయ వార్తలు

ప్రధాని పదవిపై ఆసక్తిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 4: దేశానికి ప్రధాన మంత్రి కావాలన్న కోరిక తనకు లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తపనేతప్ప జాతీయ రాజకీయాలపై ఎంతమాత్రం ఆసక్తిలేదని శనివారం ఆయన వెల్లడించారు. ‘యూపీ ముఖ్యమంత్రిగా ఉండి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తన ధ్యేయం. దేశానికి ప్రధాన మంత్రిని కావాలన్న కోరిక నాకు లేదు’ అని ఓ న్యూస్‌చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని, 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 300కు పైనే సీట్లు గెలుచుకుంటామని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు 50 శాతం మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూర్చాయని, వారంతా ఓట్లేస్తే మూడొందలకు పైగా సీట్లు తమకే వస్తాయని ఎస్‌పి అధినేత జోస్యం చెప్పారు. తన ఐదేళ్ల పదవీకాలంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. సమాజ్‌వాదీ పెన్షన్ కింద 55 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. 18 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చామని, ఎంబిబిఎస్ సీట్లు రెట్టింపుచేశామని, 108, 100 హెల్‌లైన్లు విజయవంతంగా అమలుచేసినట్టు అఖిలేశ్ పేర్కొన్నారు. కన్న విద్యాధన్ యోజన వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని, లక్షలాది మంది ప్రయోజనం పొందినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్‌పి వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో వచ్చిన విభేదాలపై మాట్లాడుతూ ‘అవన్నీ సమసిపోయాయి. తండ్రి-కుమారుడి బంధం ముందు అవేనీ నిలవలేదు. ములాయం ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష’ అని తెలిపారు.