జాతీయ వార్తలు

బిజెపితోనే అచ్ఛేదిన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదౌన్, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి, బిఎస్‌పిలను ఓడించాలని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. బిసాయిలీ బిజెపి అభ్యర్థికి మద్దతుగా కుశాగ్రనగర్ ఎన్నికల సభలో శనివారం ఆయన ప్రసంగిస్తూ బిజెపి అధికారంలోకి వస్తేనే యూపీలో అచ్ఛేదిన్ వస్తాయని అన్నారు. ఎస్‌పి, బిఎస్‌పిలను తరిమికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రెండు పార్టీల హయాంలో యూపీ సర్వనాశమైందని రాజ్‌నాథ్ నిప్పులు చెరిగారు. ఎస్‌పి, బిఎస్‌పి వైఫల్యాలను ఎండగట్టిన హోమ్‌మంత్రి బాధిత కుటుంబాలకు మంచిరోజులు తీసుకొచ్చేది బిజెపియేనని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ‘అచ్చేదిన్’ నినాదాన్ని తరచూ ప్రశ్నిస్తున్నారని- ‘యూపీ ఓటర్లకు మేం చెప్పేదొకటే.. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే అచ్ఛేదిన్ సాధ్యం. దీనికోసం ఎస్‌పి, బిఎస్‌పిలను ఈ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా చేయాలి’ అని హోమ్‌మంత్రి పిలుపునిచ్చారు. యూరి సర్జికల్ స్ట్రయిక్‌తో పాకిస్తాన్‌కు భారత్ సరైన గుణపాఠం చెప్పిందని గుర్తుచేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం గురించి తాము మాట్లాడితే భూకంపాలు వస్తాయని బీరాలు పలికిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనీసం గాలిని కూడా సృష్టించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని స్పష్టం చేసిన రాజ్‌నాథ్, 2014 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఇక్కడనుంచే కైవసం చేసుకున్నామని వెల్లడించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వంపై ఈ మూడేళ్ల కాలంలో కనీసం ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అన్నారు. మోదీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఎస్‌పి, బిఎస్‌పి, కాంగ్రెస్ లేనిపోని విమర్శలు చేస్తున్నాయని హోమ్‌మంత్రి ధ్వజమెత్తారు.