జాతీయ వార్తలు

అధికారులకు చెలగాటం అన్నదాతకు ప్రాణసంకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ తీగను పట్టుకుని వేళ్లాడుతున్న ఈ ఇద్దరూ అన్నదాతలు..పైగా తండ్రీకొడుకులు. కర్నాటక సరిహద్దులోని మడకశిర మండలం మెళవాయి గ్రామస్థులు. పొరుగు రాష్ట్రానికి చెందిన అధికారులు పరిహారం చెల్లించకుండానే తమ భూమి మీదుగా వేస్తున్న విద్యుత్ లైన్‌ను ఆపేందుకు ఇలా తీగను పట్టుకున్నారు. నచ్చజెప్పాల్సిన అధికారులు కనికరం లేకుండా జెసిబితో విద్యుత్‌లైన్‌ను లాగడంతో తండ్రీకొడుకులిద్దరూ నేలకు 50 అడుగుల పైకి లేచారు. కొంతసేపు అలాగే వేళ్లాడిన వారు, చివరకు అశక్తతతో తీగను వదిలేయడంతో నేలపై పడి గాయాలపాలయ్యారు. ఇదేం పని అని విలేఖరులు నిలదీస్తే, సర్వే చేసి నివేదికలు వచ్చాక పరిహారం అందిస్తామని అధికారులు చెప్పడం కొసమెరుపు.
- ఆంధ్రభూమి విలేఖరి, మడకశిర