జాతీయ వార్తలు

సామాజిక సంస్కరణలపై సందేశాన్ని వ్యాప్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: స్వచ్ఛ్భారత్ లాంటి సామాజిక సంస్కరణలకు సంబంధించిన అంశాలను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ సాధువులు, మత సంస్థలకు పిలుపునిస్తూ, ప్రభుత్వంకన్నా వారి మాట ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్నారు. కర్నాటకలోని ఉడిపిలో జరుగుతున్న జగద్గురు మధ్వాచార్య 7వ శతజయంతి ఉత్సవాలనుద్దేశించి న్యూఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడుతూ భక్తి ఉద్యమ కాలం నాటినుంచి కూడా సాధువులు, స్వామీజీలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలకు పరిష్కారాలను సమాజంలోనుంచే కనుగొనేందుకు ప్రోత్సహిస్తూ వస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి మత ఛాందసవాదమే మూలమని, నేను చెప్పిందే సరయినదనేది దాని సిద్ధాంతమని ఆయన అంటూ, ‘వసుధైక కుటుంబం’ సిద్ధాంతం దీనికి విరుగుడని ప్రధాని అన్నారు.
సమాజంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వీటికి పరిష్కారాలు కనుగొనడంలో మఠాలు, స్వామీజీలు ప్రధాన పాత్ర పోషించారని ఆయన అన్నారు. స్వచ్ఛ్భారత్ గురించి చెప్పాలంటే ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రభుత్వం కంటే కూడా వారి మాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందని మోదీ అన్నారు. మానవత్వంకన్నా పెద్ద మతం ఏదీ లేదని సమాజం అర్థం చేసుకునేలా చేయడంలో అలాంటి విద్యావంతులు, పండితులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. సంక్షోభాలు ఎదురయినప్పుడు ప్రపంచంలోని సమాజాలన్నీ కూడా సమాధానాల కోసం భారత్ వైపే చూస్తున్నాయని మోదీ అంటూ, ఇదే మన విలువలకు నిజమైన గుర్తింపన్నారు.‘ప్రభుత్వానికి ఎలా పన్ను కడతావో అలాగే మానవాళికి సేవ చేయ’మని జగద్గురు మధ్వాచార్యులు చెప్పేవారని ప్రధాని గుర్తు చేశారు. సంత్ కబీర్ కూడా పేదల సముద్ధరణకోసమే కృషి చేశారని కులం, మతం ఆధారంగా వివక్షకు తావు లేకుండా చేశారని ఆయన అన్నారు. పేదరికం నిర్మూలన, అసమానత్వం మొదలుకొని పర్యావరణ సమస్యల పరిష్కారం దాకా ప్రపంచాన్ని మరింత మెరుగయిన ప్రదేశంగా చేయడంలో సాధువులు, సన్యాసులు చూపిన బాట ఎంతో ఆచరణీయమని మోదీ చెప్పారు.

చిత్రం..మధ్వాచార్య సప్తశతమానోత్సవ కార్యక్రమంలో వీడియో ద్వారా ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ