జాతీయ వార్తలు

అమ్మ చూపిన బాటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 5: తమిళనాట ఆమె తెలియని వారు లేరు. పురచ్చితలైవి జయలలితకు నెచ్చెలి అన్నది ఆమె ఉనికి. తమిళనాట అమ్మగా పూజలందుకున్న రాజకీయ వేలుపు జయలలిత వెన్నంటి నీడగా నడవటం తప్ప ఇప్పటివరకు ఆమె అస్తిత్వం మరొకటి లేదు. పొయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంట్లో, అమ్మకు ఆసాంతం తోడై నిలిచిన చెలి. అమ్మ జైల్లో ఉన్నా, బయట ఉన్నా, సిఎంఓకు వెళ్లినా, ప్రచారానికి వెళ్లినా, చివరకు ఆసుపత్రిలో మూడు నెలల పాటు అస్వస్థత పాలై చేరినా ఒక్క క్షణం పాటు కూడా వీడకుండా అంటిపెట్టుకుని ఉన్న నెచ్చెలి శశికళ అమ్మ కనుమూసిన మరుక్షణం ఆమె పాత్రలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా పరకాయ ప్రవేశం చేశారు. అన్నాడిఎంకె అధినేత ఎంజి రామచంద్రన్ మరణించిన సందర్భంలో జయలలిత తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి కనాకష్టం పడాల్సి వచ్చింది. కానీ, శశికళకు అధికార పగ్గాలు ఆమె వెంటపడి చేతుల్లో వచ్చి వాలాయి. అమ్మ జయలలిత తరువాత చిన్నమ్మగా పేరున్న శశికళ, ఆమె జీవించి ఉన్నంత కాలం తెర వెనుకే ఉన్నారు. రాజకీయం అంటే ఏమిటో కూడా తెలియనంతగా కనిపించారు. డిసెంబర్ 5న జయలలిత కన్నుమూసిన అనంతరం వేగంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూసుకువచ్చారు. ఇరవై రోజుల్లోనే పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు పట్టిన శశికళ మరో నెల రోజుల వ్యవధిలో పార్టీతో పాటు పాలనాపగ్గాలనూ తన చేతుల్లోకి తీసేసుకున్నారు.
1980లలో మారుమూలన వీడియో స్టోర్స్ యజమానురాలిగా చిన్న వ్యాపారం చేసుకుంటు న్న శశికళను అనతికాలంలోనే జయలలితకు స్నేహితురాలిగా, చెల్లెలిగా మారిపోయారు. అమ్మ పక్కన శాశ్వతంగా నిలిచే స్థాయికి ఎదిగిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మకు ఆత్మగా శశికళ మారిపోయారు. 1995లో శశికళ మేనల్లుడు సుధాకరన్‌ను దత్తత తీసుకుని, భారీ ఖర్చుతో జయలలిత చేసిన వివాహం ఆమెను వివాదంలోకి నెట్టింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కోవలసి వచ్చింది.
2011లో అనూహ్యంగా జయలలిత తన స్నేహితురాలు శశికళ, ఆమె భర్త, కుటుంబసభ్యులను తనకు వ్యతిరేకంగా కుట్రచేశారన్న ఆరోపణలపై బహిష్కరించారు. కానీ, కొద్ది కాలానికే శశికళ తన కుటుంబ సభ్యులందరినీ బహిరంగంగా వదిలేసి జయ పంచన చేరారు. అప్పటి నుంచి డిసెంబర్ 5న అమ్మకు తానే స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేంత వరకూ శశికళ తన స్నేహితురాలిని విడిచిపెట్టలేదు. తన జీవిత కాలంలో జయలలిత ఎదుర్కొన్న అన్ని కేసుల్లోనూ ఆమెతో పాటు శశికళ కూడా నిందితురాలిగానే ఉన్నారు. 2016 సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో జయలలిత చేరిన నాటి నుంచి డిసెంబర్ 5న ఆమె మరణించేంత వరకూ కూడా తాను తప్ప ఎవరినీ ఆమె దగ్గరకు వెళ్లనివ్వకుండా నిరోధించటం, చూడనివ్వకపోవటం అనేక వివాదాలకు దారితీసింది. అయితే ఇవేవీ కూడా శశికళ అధికార ప్రస్థానాన్ని నిలువరించలేకపోయాయి. చివరకు జయలలిత మేనకోడలు దీప తానే పురచ్చితలైవి వారసురాలినంటూ అడపాదడపా టీవీల ముందు హూంకరించినా ఫలితం లేకపోయింది. ఆమె అధికారంలోకి రావటానికి ముందే ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు చేర్పులు జరిగిపోయాయి. ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ సహా పలువురు బ్యూరోక్రాట్లు రాజీనామాలు చేయటం వాటిని ఆమోదించటం చకచకా జరిగిపోయాయి. అటు పార్టీలోనూ 23మంది కార్యవర్గ సభ్యులను శశికళ నియమించారు. మొత్తం మీద ఎలాంటి అవరోధాలు లేకుండా ఆదివారం సాయంత్రం చిన్నమ్మ పట్ట్భాషేకానికి ముహూర్తం ఖరారైపోయింది.