జాతీయ వార్తలు

జాతీయ గీతం, గేయంపై వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: జాతీయ గీతం, జాతీయ గేయం వెనుక చారిత్రక వాస్తవాలను కనుగొనడానికి తాజాగా ప్రయత్నాలు చేయాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు ఆ సమాచారం తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ పిఎంఓ సమాచారం నిరాకరించడంతో సిఐసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘జనగణమన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా సర్టిఫై చేశారా అనే విషయాన్ని తెలియజేయాలని, అలాగే రవీంద్రనాథ టాగూర్ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించడానికి సంబంధించిన పూర్తి ఫైల్ నోటింగ్స్ వివరాలను తెలియజేయాలని హరిందర్ ధింగ్రా అనే అతను సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరారు. అయితే అతను కోరిన సమాచారం తమ పరిధిలోకి రాదని పిఎంఓ తెలియజేసింది.
జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ అంశాల విషయంలో ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలకు చెందిన సెంట్రల్ పౌర సమాచార అధికారులు (సిపిఐఓలు) అందరు కూడా ఏమాత్రం ఆలోచించకుండా బాధ్యతను ఇతరులపైకి నెట్టేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని సమాచార కమిషనర్ శ్రీ్ధర్ ఆచార్యులు తన ఉత్తర్వులో అభిప్రాయపడ్డారు. దీనివల్ల జనగణమన, వందేమాతరానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఏవయినా రికార్డులున్నాయా లేవా అనే అనుమానాలు తలెత్తడానికి కారణమవుతోందని ఆయన ఆ ఉత్తర్వులో అభిప్రాయ పడ్డారు. అందువల్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను పోగొట్టడానికి రికార్డులను లోతుగా పరిశీలించి పూర్తి వాస్తవాలతో కూడిన ఒక అధీకృత సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అంతేకాదు జాతీయ గీతాన్ని గౌరవించనందుకు లేదా ఆ గీతం ఆలపించేటప్పుడు లేచి నిలబడనందుకు ప్రజలను శిక్షించడానికి ముందు ‘జనగణమన’ను జాతీయ గీతంగా ప్రకటించడానికి దారితీసిన చారిత్రక వాస్తవాలను, ప్రాధాన్యతల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కూడా శ్రీ్ధర్ ఆచార్యులు ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.