జాతీయ వార్తలు

ప్రవేశ పరీక్షలకోసం ఏజన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఐఐటిలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకోసం ఒక ప్రత్యేక ఏజన్సీ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. అలాగే ఆన్‌లైన్‌లో 2వేల కోర్సులను ఆఫర్ చేసేందుకు యుజిసి-నెట్‌ను, ఒక ప్లాట్‌ఫామ్‌ను వచ్చేనెల ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటివరకు సిబిఎస్‌ఇ నిర్వహిస్తున్న వివిధ పరీక్షలను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహిస్తుందని ఆయన ఆదివారం ఇక్కడ చెప్పారు. ఈ పరీక్షలను నిర్వహించే బాధ్యత సిబిఎస్‌ఇది కాదని ఆయన చెప్పారు. అలాగే దేశంలో ఇంజనీరింగ్ కాలేజిల్లో అడ్మిషన్లకోసం ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్న ఐఐటిలు, ఏఐసిటిఇల భారం కూడా ఈ ఏజన్సీ వల్ల తొలగిపోతుందని జవడేకర్ చెప్పారు. ఈ ఏజన్సీ స్థూల స్వరూప స్వభావాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం 2 వేల ఆన్‌లైన్ కోర్సులను అందించడానికి ‘స్వయం’ పేరుతో ఒక ఓపెన్ వెబ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను వచ్చే నెల ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ‘మాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ కోర్సెస్’ (మూక్స్) ప్లాట్‌ఫామ్ అయిన ఈ ‘స్వయం’ డబ్బులకు సంబంధించి ఎటిఎం ఎలాంటిదో విద్యకు సంబంధించి అలాంటిదని ఆయన అన్నారు. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దేన్నయినా నేర్చుకోవడానికి వీలుగా ఈ ప్లాట్‌ఫామ్ ఉంటుందని చెప్పారు. ఈ స్వయం, డిటిహెచ్ చానళ్లు భాగస్వాములందరికీ మరింత ఆమోదయోగ్యంగా ఉండేలా చూడడానికి ఒక అవగాహనా కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది రాబోయే రోజులకు ఒక మెరుగైన ప్లాట్‌ఫామ్‌గా ఉండడానికి ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడిఎల్) విధానంతో కూడుకుని ఉంటుందని జవడేకర్ చెప్పారు.
విద్యారంగంలో మరింతగా పారదర్శకత, స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని తీసుకు రావడానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)లో కీలక సంస్కరణల్లో భాగంగా గ్రేడెడ్ రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వ విజన్‌ను అది ప్రతిబింబిస్తోందన్నారు. అందుకే ఈసారి విద్యారంగానికి అదనంగా 6వేల కోట్ల నిధులు లభించాయన్నారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించినందుకు ఆయన ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలియజేశారు.