జాతీయ వార్తలు

మోదీ ఓ కామెర్ల రోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఫిబ్రవరి 5: ‘కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’ తప్పులు చేస్తున్న మోదీకి ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తానేమి చెప్పినా ప్రజలు నమ్మేస్తారని ప్రధాని అనుకుంటున్నారని, అందుకే ఆయన అబద్ధాలు చెబుతున్నారని కూడా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి చేతిలో బిజెపి చిత్తుగా ఓడిపోయినట్లుగా ఇక్కడకూడా ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని కోరారు. మీరట్‌లో శనివారం జరిగిన సభలో మాట్లాడుతూ ప్రధాని స్కామ్ అంటే సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్, అఖిలేశ్ యాదవ్, మాయావతిగా అభివర్ణించడాన్ని ప్రస్తావిస్తూ తనకు మాత్రం స్కామ్ అంటే సేవ (సర్వీస్), సాహసం (కరేజ్), సామర్థ్యం (అబిలిటీ), సచ్చీలత (మాడెస్టీ) అని అన్నారు.
కాగా, ఇదే సభలో మాట్లాడిన అఖిలేశ్ యాదవ్ ‘స్కామ్’ అంటే ‘సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్‌షా, అండ్ మోదీ’ (ఈ దేశాన్ని అమిత్ షా, మోదీలనుంచి కాపాడండి) అంటూ కొత్త భాష్యం చెప్పారు. కాగా, మాయావతితో కలిసి బిజెపి మూడుసార్లు బిజెపి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రెండు పార్టీలకు మధ్య సత్సంబంధాలున్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఉత్తుత్తి హామీలు తప్ప ఏమీ ఇవ్వలేదని, సమాజ్‌వాది పార్టీ మాత్రం యుపిలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిందన్నారు.

చిత్రం..కాన్పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్‌తో రాహుల్ గాంధీ