జాతీయ వార్తలు

5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 9న పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 9న ఎన్నికలు జరుగుతాయి. ఏపిలో మూడు పట్ట్భద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణకు 13వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 20 తుది గడువు. మార్చి 9న పోలింగ్ నిర్వహించి 15న లెక్కింపుప్రక్రియ చేపడతారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఏపీలోని శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గం, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు జిల్లాల పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అవుతున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.