జాతీయ వార్తలు

మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 6: తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఎన్నికలకు తేదీ ఖరారైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజక వర్గానికి మార్చి 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి మరో అయిదు పట్ట్భద్రుల స్థానాలకు కూడా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. త్వరలో తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అవుతున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల కేంద్ర ఎన్నికలు సంఘం చేయనుంది. నామినేషన్లు స్వీకరణకు తుది గడుపు ఫిబ్రవరి 20కాగా, ఫిబ్రవరి 21 నాడు నామినేషన్లను పరిశీలించనుంది. నామినేషన్లు ఉపసంహరణ గడుపును ఫిబ్రవరి 23గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 9 నాడు ఎన్నికలు సంఘం ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక నియోజక వర్గాల కౌంటింగ్ మార్చి 15 నాడు నిర్వహించనున్నా కేంద్ర ఎన్నికల సంఘం అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది. తెలంగాణతో పాటు ఏపీ శాసన మండలిలో మొత్తం ఐదు స్థానాలలో మూడు పట్ట్భద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయుల నియోజక వర్గాలు మార్చి 29న ఖాళీ అవుతున్నాయి.