జాతీయ వార్తలు

విభజన హామీలు అమలుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేయకపోవటం సిగ్గు చేటని టిఆర్‌ఎస్ సభ్యుడు డి శ్రీనివాస్ విమర్శించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్‌డిఏ భాగస్వామి కాకున్నా పెద్దనోట్ల రద్దును సమర్థించారని, అయినా కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని డిఎస్ ఆరోపించారు. శ్రీనివాస్ సోమవారం రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో మాట్లాడుతూ ఎన్‌డిఏ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవటం లేదని అన్నారు. అరవై ఏళ్ల పోరాటం తరువాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నీటిపారుదల, సామాజిక సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అత్యంత ముఖ్యమైన పథకాలని ఆయన చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ పథకం ప్రతిష్టాత్మకమైందని శ్రీనివాస్ చెప్పారు. మైనారిటీలతోపాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కెసిఆర్ కృషి చేస్తున్నారని డిఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర శాసన సభ సీట్లను వెంటనే పెంచాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్టప్రతి ప్రసంగంలో వెనుకబడిన కులాల ప్రస్తావన లేకపోవటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.