జాతీయ వార్తలు

ఓర్వలేకే మోదీపై విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ప్రజాదరణను ఓర్వలేకే విపక్షాలు ఆయనపై ఉద్దేశపూర్వకంగా విరుచుకుపడుతున్నాయని సినీనటి, బిజెపి ఎంపీ హేమమాలిని సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలన్నీ కలిసి నరేంద్ర మోదీనే లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వెనకున్న ఉద్దేశం అదేనని విశే్లషించారు. అన్ని వర్గాల ప్రజల్లోనూ నరేంద్ర మోదీకి ఆదరణ పెరుగుతోందని, విద్యార్థులు, పేదలు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ ఆయనను విశేషంగా అభిమానిస్తున్నారని పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇంతగా జనంలోకి వెళ్లిపోయిన నరేంద్ర మోదీని ఏ విధంగా తప్పుబట్టాలో తెలియక విపక్షాలు ఉమ్మడిదాడి మొదలుపెట్టాయని స్పష్టం చేశారు. మోదీని రావణాసురుడితో పోలుస్తూ సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై హేమమాలిని స్పందించారు. తాజా అసెంబ్లీ ఎన్నికలకు అభివృద్ధి ప్రాతిపదికనే ఎదుర్కొంటామని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ రామాలయ అంశాన్ని బిజెపి నేతలు ప్రస్తావించడం గురించి అడిగినప్పుడు, కేవలం ఆలయం నిర్మాణంపైనే దృష్టి పెట్టకుండా డిజిటల్ ఇండియా వంటి అభివృద్ధి అంశాలను ప్రచారంలోకి తేవడం ఎంతైనా అవసరమన్నారు. దేశంలో ఒక్క రామాలయ నిర్మాణ అంశమే కాదని, ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన అంశాలు ఎన్నో ఉన్నాయని హేమమాలిని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా వంటి భారత్‌ను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలను చేపట్టిన నరేంద్ర మోదీని మరింత ప్రోత్సహించాలే తప్ప విమర్శించడమే పనిగా పెట్టుకోకూడదని హేమమాలిని హితవు పలికారు.

చిత్రం..పార్లమెంటు ప్రాంగణంలో కేంద్ర మంత్రి మనీశ్ శర్మతో ఎంపీ హేమమాలిని