జాతీయ వార్తలు

ఎదురుగాలిలోనూ దూసుకెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతాపూర్ (యూపీ), ఫిబ్రవరి 6: సమాజ్‌వాదీలకు ఎంతటి ఎదురు గాలిలోనైనా సైకిల్‌పై దూసుకెళ్లటం ఎలాగో తెలుసని యూపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘గాలి బలంగా వీస్తున్నప్పుడు ఎంతటి యువనేత అయినా తట్టుకోలేడని, ఎవరి సాయాన్నైనా కోరుతారని, కానీ ఈసారి బిజెపి తుపానులో తాను కొట్టుకుపోతానేమోనని ముఖ్యమంత్రి భయపడుతున్నారని’ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. సీతాపూర్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘బిజెపి ప్రజలను బ్యాంకుల ముందు క్యూలలో నిలబడేలా చేసింది. పేద ప్రజలెంతో మంది ఈ క్యూలలో తట్టుకోలేక చనిపోయారు. సమాజ్‌వాది ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ.2లక్షల సాయాన్ని ప్రకటించింది. మోదీ సార్వత్రిక ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా ఏ ఒక్క ఖాతాలోకీ రూ. 15లక్షలు జమకాలేదు’ అని అఖిలేశ్ విమర్శించారు.