జాతీయ వార్తలు

అఖిలేశ్‌కే యూపీ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 6: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్ యాదవ్ మళ్లీ యూపీ పగ్గాలు చేపడతారని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. ‘అఖిలేశ్ యాదవ్ కాబోయే ముఖ్యమంత్రి. మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. మంగళవారం నుంచి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. అమర్‌సింగ్‌లో ఎలాంటి అసంతృప్తిలేదు. మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు’ అని ములాయం స్పష్టం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ములాయం సింగ్ తన సోదరుడు శివపాల్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించి ఇప్పుడు ‘యు’టర్న్ తీసుకున్నారు. తన కుమారుడు అఖిలేశ్ నిలబెట్టిన అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు తాజాగా వెల్లడించారు. ‘మా కుటుంబంలో ఎవరూ అసమ్మతివాదులు లేరు. శివపాల్ యాదవ్‌కు ఎలాంటి అసంతృప్తిగాని, ఆగ్రహం గానీ లేదు’ అని ఆయన పేర్కొన్నారు. తనకు చెప్పకుండా శివపాల్ కొత్త పార్టీ పెట్టరని కూడా ములాయం తెలిపారు. జస్వంత్‌నగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన శివపాల్ మార్చి 11న కొత్తపార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

చిత్రం.. ములాయం